కుప్పంరూరల్: వీధి కుక్కల దాడిలో 79 నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఘటన వివరాలు యజమాని జ్యోతిశ్వర్ కథనం మేర కు ఇలా ఉన్నాయి. తంబిగానిపల్లి గ్రామానికి చెందిన జ్యో తీశ్వర్ 100 నాటి కోళ్లును పెంచుకుంటున్నాడు. శనివారం కోళ్లను వదిలిపెట్టి బయటికి వెళ్లడంతో వీధి కుక్కలు దాడిచేసి 79 కోళ్లను చంపేశాయి. దీంతో యజమాని జ్యోతిశ్వర్‌కు సుమారు 80 వేల రూపాయలు నష్టం వాటిల్లింది.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
పలమనేరు: పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఓ లేఅవుట్‌లో దండుమిట్టకు చెందిన నాగరాజు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ విషయాన్ని స్థానికులు శనివారం పొద్దు న గుర్తించి పోలీసులకు సమాచారమందించా రు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబా న్ని పోషించేవాడిని తెలిసింది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టి సమాచారం. మృతదేహాన్ని స్థాని ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు.
ఇంటిపై కూలిన చింత చెట్టు
– సుమారు రూ.10వేలు నష్టం
పెద్దపంజాణి: నివాసం ఉన్న ఇంటిపై చింత చెట్టు పడిన సంఘటన మండలంలోని బనకందొడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. భాది తుని కథనం మేరకు వివరాలు.. గ్రామంలోని రెడ్డెప్ప కుటుంబీకులు నివాసం ఉన్న ఇంటి పక్కనే పురాతనమైన చింత చెట్టు ఉంది. శనివారం ఉదయం అకస్మాత్తుగా చింత చెట్టు లోని అర్ధ భాగం కూలి ఇంటిపై పడింది. అదృష్టవశా త్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. అయితే ఇంటికి ఏర్పాటుచేసి న గోడలు, పాక్షికంగా పైకప్పు ధ్వంసం కావడంతో దాదాపు రూ.10వేలు నష్టం వాటిల్లిందని బాదితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడవిపందులను వేటాడిన ముగ్గురి అరెస్టు
చిత్తూరు కార్పొరేషన్: అడవి పందులను వేటాడిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఈస్ట్ ఎఫ్‌ఆర్వో థామస్ తెలిపారు. శుక్రవారం తమకు అందిన సమాచా రం మేరకు రొంపిచెర్లలో తనిఖీ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఐదుగురు అడవి పందులను వేటాడినట్టు గుర్తించామన్నారు. పులిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ గురికివారిపల్లి చెందిన దొరస్వామి, రొంపిచెర్ల ఎలపడ్డ హరిజనవాడకు చెందిన బాబు, రొంపిచెర్ల చెన్నమరెడ్డిగారిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రెండు అడవి పందులు, మరో రెండు అడవి పందుల మాంసం, నాలుగు కత్తులు, విద్యుత్ వైర్లు, బైయిండింగ్ వైర్లు, చెక్క మొద్దు, ఒక బైక్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రొంపిచెర్ల హరిజనకాలనీ ఎలపాడకు చెందిన వాసు, పెద్దమల్లెలకు చెందిన రాజు పరారయ్యారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారించగా, అటవీ ప్రాంతంలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి, అడవి పందులను వేటాడి, వాటి మాంసం విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌బీఓ గౌస్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎబీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నిందితులను అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు చిత్తూరులో మీడియాకు తెలిపారు.


