కల్వర్టును ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొని వ్యక్తి దుర్మరణం

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

పూతలపట్టు(యాదమరి): గోపాలకృష్ణాపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు..గుడిపాల మండలం పేయనపల్లికి చెందిన తిరుమల(31) కరకంబాడి సమీపంలోని ఓ ప్రైవే టు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని బైక్‌పై తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్నాడు. గోపాలకృష్ణాపురం వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన తిరుమల అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య కాపురానికి రాలేదని..

– వేలు నరికేసుకున్న భర్త

రామకుప్పం(శాంతిపురం): భార్య కాపురానికి రాలేదన్న కోపంతో భర్త తన చూపుడు వేలును నరుక్కున ఘటన రామకుప్పం మండలంలోని బల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కెంచనబల్ల పంచాయతీ గాంధీనగర్‌కు చెందిన మంజునాథ్‌(35), బల్ల గ్రామానికి చెందిన సరితతో తొమ్మిదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మంజునాథ్‌కు సొంత ఆటో ఉండడంతో మిత్రులతో కలిసి కొబ్బరి బొండాల వ్యాపా రం చేస్తుండగా సరిత వ్యవసాయ కూలి పనులు చేస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 15 రోజుల క్రితం సరిత బిడ్డలను తీసుకుని పుట్టింటికి చేరింది. వాళ్లను తీసుకురావడానికి ఆదివారం మంజునాథ్‌ బల్లకు వెళ్లాడు. తను మద్యం మానేస్తేనే వస్తానని సరిత చెప్పడంతో ఆగ్రహించిన మంజునాథ్‌ తన ఆటోలో ఉన్న కొబ్బరి కాయలు చెక్కే కత్తితో ఎడమ చేతి చూపు డు వేలును నరుక్కున్నాడు. చేతి నుంచి వేలు వేరుపడి రక్తస్రావం అధికంగా ఉండడంతో చూసి న స్థానికులు కత్తిని లాక్కుని కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరికి గాయాలు

కుప్పం రూరల్‌: కుప్పం మండలం నాయనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఇద్దరు యువకులు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి... నాయనూరు పెద్దవంకలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికోసం కంగుంది కాలనీకి చెందిన బాబు, మంజులు అనే ఇద్దరు యువకులు ఓ ట్రాక్టర్‌ తీసుకుని బయలుదేరారు. ట్రాక్టర్‌ నాయనూరు సమీపంలో వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బాబు, మంజు ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు గమనించి గాయపడ్డ ఇద్దరిని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

నీటి కుంటలో పడి

తమిళ ‘టెకీ’ మృతి

కుప్పం రూరల్‌: స్నేహితుడికి పెళ్లి వేడుకను చూడటానికి వచ్చిన మరో స్నేహితుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తమిళనాడుకు చెందిన భారతిదాస్‌ (27) సాప్ట్‌వేర్‌ ఉద్యోగి (టెకీ) నీటికుంటలో పడి చనిపోయాడు. చైన్నె నందకంలో పనిచేస్తున్న ఎనిమిది మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తమిళనాడులోని కాట్పాడిలో తన స్నేహితుడి వివాహం కోసం వచ్చారు. పెళ్లయిన తరువాత వీళ్లంతా కుప్పం సమీపంలో ఉన్న నాయనూరు దిబ్బరేవు నీటి కుంటలో సరదాగా గడపడానికి ఆదివారం ఇక్కడకు వచ్చారు. అందరూ ఇక్కడు న్న నీటితో సరదాగా ఈత కొడుతున్నారు. వీళ్లల్లో సీనియర్‌ సాప్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్న భారతిదాసన్‌ ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. వెంటనే గుర్తించిన ఇతని స్నేహితులు అపస్మారకస్థితిలో ఉన్న భారతిదాస్‌ను నీటితొట్టె నుంచి వెలుపలకు లాగి, స్థానికుల సాయంతో కుప్పం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇతను చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

టపాసులు పేలి చేతులకు గాయాలు

కుప్పం రూరల్‌ : కుప్పం మండలం, మేసీ్త్ర నాయనూరుకు చెందిన షణ్ముగం శనివారం మరణించా రు. ఆయన అంత్యక్రియలు ఆదివారం చేపట్టా రు. అంత్యక్రియల కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున బంధువులు వచ్చారు. ఈ క్రమంలో షణ్ముగం అంతిమ యాత్ర సందర్భంగా కొందరు బంధువులు టపాకాయలు పేల్చా రు. తమిళనాడు ధర్మపురికి చెందిన శక్తివేలు టపాకాయలు కాల్చడం మొదలుపెట్టారు. చేతిలోనే టపాసులు పేలడంతో రెండు చేతులు చిద్రమై తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బంధువులు అతన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement