సబ్సిడీలో ఈ–సైకిళ్లు
చిత్తూరు అర్బన్: మహిళా సంఘాలు, నగర ప్రజలకు సబ్సిడీతో ఈ–సైకిళ్లను (బ్యాటరీ సైకిళ్లు) ఇవ్వనున్నట్లు చిత్తూరు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) సీఎంఎం గోపి తెలిపారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై రూ.36 వేలు ఉన్న సైకిల్‌ను కలెక్టర్ చొరవతో ప్రజలకు రూ.24 వేలకే అందిచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 800 మంది సైకిళ్ల కోసం నగదు చెల్లించి, బుకింగ్స్ చేసుకున్నారని తెలిపారు. ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్లకు రూ.7 వేల విలువచేసే యాక్ససరీస్ ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. రూ.5 వేలు డౌన్‌పేమెంట్ చెల్లించి సైకిల్ తీసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సంప్రదించాలన్నారు.


