మనీ మార్నింగ్ అంటూ మోసం..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మనీ మార్నింగ్ చెప్పండి..దండిగా డబ్బులు సంపాదించవచ్చునని ఓ నిర్వాహకులు మోసం చేశారని చిత్తూరు నగరం, దొడ్డిపల్లికి చెందిన గుణసుందరం, జీడీ నెల్లూరు పాచిగుంటకు చెందిన భాగ్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఎంఎస్ అనే టీంలో చేరితే కోట్లు సంపాదించవచ్చని, ఈ బైక్ కూడా కొనుక్కోవచ్చని ఆ టీం లీడర్ బాలాజీ అనే వ్యక్తి మోసం చేశాడని వారు ఆరోపించారు. ఆ టీంలో చేరేందుకు ప్రతి ఒక్కరూ రూ.15 వేల చొప్పున్న చెల్లించామన్నారు. అలా చేరిన వ్యక్తులు మరో ఇద్దరిని చేర్పించాలని, అలా చేస్తే.. చేరిన ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల చొప్పున్న డబ్బులు వస్తాయన్నారు. తీరా అదనపు ఆదాయం రాకపోగా.. కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వకుండా టీం లీటర్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గుడ్ మార్నింగ్‌కు బదులు.. మనీ మార్నింగ్ చెప్పండంటూ.. మోసం చేశారని తెలిపారు. పోలీసులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారి వెంట శంకర్, ధనరాజ్‌లు ఉన్నారు.
అరటి చెట్లను ధ్వసం చేసిన ఏనుగులు
మనీ మార్నింగ్ అంటూ మోసం..


