సీపీఎం సీనియర్ నేత వీరవర్మ మృతి
తిరుపతి కల్చరల్: సీపీఎం సీనియర్ నేత అవనిగడ్డ వీరవర్మ(84) బుధవారం ఉదయం స్విమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉద్యమంలో సీపీఎం అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. చివరి శ్వాస విడిచేంత వరకు పార్టీ కోసం తపించేవారని సైద్ధాంతిక నిబద్ధతను కనబరిచారని సీపీఐ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. ఏవీ వర్మ పార్థివదేహాన్ని వైద్యపరిశోధన నిమిత్తం గురువారం ఉదయం ఎస్వీ మెడికల్ కళాశాలకు అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. ఏవీ వర్మ మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర నేత పి.సోమయ్య, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి కే.నేతాజీ, నగర కార్యదర్శి నళినీ కాంత్ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.
ఏవీ వర్మకు ఘన నివాళి
ప్రముఖులు మాజీ మంత్రి చింతామోహన, సీనియర్ పాత్రికేయుడు రాఘవ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, సీపీఎం చిత్తూరు జిల్లాకార్యదర్శి గంగరాజు, సీపీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, సీపీఎం నేతలు మాధవ్, వేణుగోపాల నాగార్జున, వెంకటేశం, గుణశేఖర్, నరేంద్ర, ఎన్‌డీ.శ్రీను, అర్జున్, ఆదిశేషారెడ్డి, చంద్ర, వెంకటేష్‌లతో పాటు వర్మ కుమార్తెలు అవనిగడ్డ కల్యాణి, వనజ, పద్మజ, ఆయన మృత దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. కాగా పార్టీ కార్యకర్తలు, ప్రజల దర్శనార్థం ఆయన మృతదేహాన్ని సీపీఎం కార్యాలయం వద్ద గురువారం ఉంచనున్నట్లు తెలిపారు.


