భోగి వెలుగులు.. సంక్రాంతి సందళ్లు
చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో మంగళవారం సాయంత్రం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా భోగి మంటలను వేసి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం సిబ్బంది, సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శిల్పారామం అసిస్టెంట్ ఆఫీసర్(ఏఓ) సుధాకర్ భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పారామం అసిస్టెంట్ ఇంజనీర్ రాధాకృష్ణ, ఫీల్డ్ సూపర్‌వైజర్లు పప్పి, సూర్యతేజ, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొని భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా, ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.


