తెలుగు సంప్రదాయాల సంక్రాంతి
చిత్తూరు అర్బన్: ‘తెలుగుదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, కుటుంబ సమేమతంగా సంక్రాంతి ను జరుపుకోవాలి..’ అని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆయన ఓ ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడా కూడా జల్లికట్టు, కోడి పందాలు, పే కాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని కోరారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది వస్తే డయల్–112, పోలీసు వాట్సప్ –9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమని వైఎస్సా ర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆరోపించా రు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరుల తో మాట్లాడారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్లు ఉండగా కేవలం రూ.1,100 కోట్లు విడుదల చేసి సంక్రాంతి కానుక అని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రకటించిన కొద్దిపాటి సొమ్ము కూడా పండుగ నాటికి చేతికి అందే అవకాశాలు లేవన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో నిరాశ తప్ప సంక్రాంతి సంబరాలు లేవన్నారు.
తెలుగు సంప్రదాయాల సంక్రాంతి


