గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
నగరి : మండల కేంద్రం నగరి నుంచి మేళపట్టు, ముడిపల్లె, రామాపురం గ్రామాలకు, మీరా సాహెబ్‌పాళెం నుంచి మేళపట్టుకు ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో నగరి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించారు. నేడు ఆ అండర్ బ్రిడ్జిలో హెవీలోడ్ టిప్పర్లు తిరుగుతుండడంతో సిమెంటు రోడ్లు ఛిద్రమై లోపలున్న ఇనుప కమ్మీలు కూడా బయటకు కనిపిస్తోంది. రాత్రి పూట ఈ మార్గంలో బైక్‌పై వచ్చేవారు ప్రమాదాలకు లోనయ్యే ఆస్కారం ఉంది. అలాగే విజయపురం మండలానికి వెళ్లే ప్రదాన రోడ్లయిన పన్నూరు రోడ్డు, కనకమ్మసత్రం రోడ్డు అధ్వాన్నంగా ఉన్నాయి. అలాగే పుత్తూరు మండలం సిరుగురాజుపాళెం, తడుకు రింగురోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు ఇలా ఉంటే ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం హాశ్యాస్పదంగా ఉందని స్థానికులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
రోడ్ల సొగసు చూడతరమా?
పలమనేరు: పలమనేరునియోజకవర్గంలో దాదాపు 250 కి.మీ తారురోడ్లు ఉండగా వాటిల్లో 60 శాతం రోడ్డు వర్షాల కారణంగా అధ్వాన్నంగా మారాయి. గతంలో రూ.4.13 కోట్లతో 6,395 మీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేసినట్టు చెబుతున్నా అవికూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
● బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది.
● పలమనేరు మండలం,కొలమాసనపల్లి పంచాయతీ, ఎర్రగొండేల్లి–మాదిగబండ రహదారి వానపడితే నాలుగడుగుల లోతు వరకు నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.
● గొల్లపల్లి జంక్షన్ నుంచి మాదిగబండ, చెన్నుపల్లి నుంచి కల్లాడు గంగమాంబ సర్కిల్ రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి.
● వీకోట పట్టణం నుంచి కర్ణాకట రాష్ట్రంలోని కేజీఎఫ్‌కు వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
● పెద్దపంజాణి మండలంలోని చీకలదిన్నేపల్లి– మద్దలకుంట, రాయలపేట–మాధవరం, కరసనపల్లి–రాజుపల్లి రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది.
మట్టి రోడ్డును తలపిస్తున్న తారు రోడ్డు
శాంతిపురం: పలమనేరు జాతీయ రహదారిలోని బడుగుమాకులపల్లి క్రాసు–విజలాపురం రోడ్డు నుంచి కొలమడుగు పంచాయతీలోని కదిరిముత్తనపల్లికి వెళ్లే తారు రోడ్డు ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. ఇరవై ఏళ్ల క్రితం నల్లరాళ్లపల్లి మీదుగా నిర్మించిన ఈ రోడ్డుకు తర్వాత కాలంలో నిర్వహణ పనులు చేయక ధ్వంసమైంది. గత ఏడాది కదిరిముత్తనలపల్లిలో జరిగిన కురబదేవర కోసం తారు రోడ్డు గుంతలకు మట్టిని తోలి తాత్కాలికంగా మేనేజ్ చేశారు. పూజల్లో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో రోజుల వ్యవధిలోనే రోడ్డు మళ్లీ గుంతలు తేలింది. తర్వాత ఇప్పటి వరకూ ఈ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు.
రోడ్లు
పట్టించుకోరా?
గుడిపాల: మండలంలోని మందిక్రిష్ణాపురం నుంచి తమిళనాడుకు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉంది. రోడ్డంతా కంకరలేచి గుంతలమయంగా ఉంది.
గుంతలు..కళ్లకు గంతలు
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మోకాలి లో తు గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతపేటలోని డివైడర్ల జంక్షన్ వద్ద పెద్ద గుంత పడింది. బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన గుంతలు పడ్డాయి. కడా పీడీ కోసం నిర్మించిన ప్రాజెక్టు డైరెక్టర్ బంగ్లా రోడ్డు గుంతలు, వర్షం నీటి తో అధ్వాన్నంగా తయారైంది. శాంతినగర్ నుంచి గుడుపల్లె రోడ్డు లింక్‌గా ఉన్న ఈ మార్గం దుస్థితికి చేరింది. కోర్టు రోడ్డు, గుడుపల్లె రోడ్డు, పట్టణంలో అక్కడక్కడ మూడు నెలల క్రితం చేపట్టిన మరమ్మతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్యాచ్ వర్క్‌లకు వేసిన తారు లేచిపోయింది.
అడుగుకో గొయ్యి..
ఈతతోపు రోడ్డుకు మోక్షమెప్పుడో?
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు మండలం, తాళంబేడు పంచాయతీ, ఈతతోపు రోడ్డు అధ్వాన్నంగా దర్శనమిస్తోంది. ఏడాది క్రితం ఈ రోడ్డుకు కంకర వేసి వదిలేశారు. అప్పట్నుంచి ఈ రోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇక పండుగలకు వచ్చే జనమంతా ఆ రోడ్డు చూసి ఛీదరించుకుంటున్నారు. ఈ సంక్రాంతికై నా రోడ్డు బాగుపడుతుందనుకుంటే...మళ్లీ కంకరేనా...? అంటూ నిట్టూర్చుతున్నారు.
కార్వేటినగరం:నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించాల్సివస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
కార్వేటినగరం మండలం, కుమ్మరగుంట ఒడ్డి ఇండ్లకు సమీపంలో రోడ్డు కంకర తేలిపోయింది.
కొల్లాగుంట నుంచి శీకాయపట్టెడ గ్రామానికి వెళ్లె బీటీ రోడ్డు కంకర తేలింది.
కార్వేటినగరం– పచ్చికాపల్లం మార్గంలోని విజయమాంబాపురం గ్రామానికి సమీపంలో ఉన్న బీ టీ రోడ్డు అడుగు లోతు గుంతతో దర్శనమిస్తోంది.
పాసముద్రం మండలం, వీర్లగుడి దళితవాడకు వెళ్లే రోడ్డుకు 2018లో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిధులు మంజూరు చేసినప్పటికీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ స్వాహా చేసి రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకుండా పోయాడు.
వెదురుకుప్పం మండలం, మాంబేడు గ్రామానికి వెళ్లే తారు రోడ్డు దుస్థితికి చెరింది.
బాలుపల్లి నుంచి కురివికుప్పం వెల్లే రోడ్డు మార్గం గుంతలమయంగా మారింది.
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు


