మందుచూపు!
ప్రభుత్వం నుంచి అనుమతిరాకనే అదనపు వసూళ్లు ప్రతి బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచేసిన వ్యాపారులు ఐదు రోజుల్లో రూ.కోటికి పైగా అక్రమ వసూళ్లు
చిత్తూరు అర్బన్: మద్యం విక్రయాలకు సంబంధించి బాటిల్‌పై రూ.10 పెంచుకోవడానికి మంత్రి వర్గంలో తీర్మానం అలా చేశారంతే. ఆ తీర్మానం తరువాత ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు వెళ్లాలి, ప్రభుత్వం వాటిలో లోటుపాట్లు గుర్తించి జీవో ఇవ్వాలి. ఇవేవీ తమకు పట్టదన్నట్లు జిల్లాలో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి వర్గం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ రాగానే.. జిల్లాలో ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై ఏకంగా రూ.10 చొప్పున పెంచేశారు.
అక్రమ వసూళ్లు
జిల్లాలో 113 మద్యం దుకాణాలు, ఏడు మద్యం బార్లు ఉంటే.. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం నుంచే 90 శాతం దుకాణాల్లో మద్యం ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ రోజు అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎకై ్సజ్ పాలసీలో పలు మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఇందులో ప్రతీ మద్యం బాటిల్‌పై రూ.10 పెంచడమనేది ప్రధాన నిర్ణయం. రూ.99 మద్యానికి ఇందులో మినహాయింపు ఇచ్చింది. మంత్రి వర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ధరలు అమాంతంగా పెంచేశారు. ప్రతీ క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అక్రమంగా వసూలు చేసేస్తున్నారు. బీర్ విక్రయాలపై ధరల పెంపు లేకపోయినా.. జిల్లాలో యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇక ప్రీమి యం బ్రాండ్ల క్వార్టర్ బాటిల్‌పై రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐదు రోజులుగా ఈ దందా సాగిస్తున్నా అడిగే దిక్కులేదు. రోజుకు రూ.కోటికి పైగా సాగే మద్యం విక్రయాల నుంచి ఈ ఐదు రోజులకు అక్రమ వసూళ్ల ద్వారా రూ.కోటి వరకు ఆదాయం చేకూరింది.
భారీగా ఆఫ్ టేక్
మరోవైపు ప్రభుత్వం నుంచి ధరల పెంపు జీవో రాకమునుపే మద్యం డిపోల నుంచి భారీగా స్టాకును (ఆఫ్‌టేక్)కు దుకాణాలకు తరలిస్తున్నారు. ధరలు పెరిగిన తరువాత లాభం కోసం ఎదురుచూడడంకంటే.. అమల్లోకి రాకమునుపే మద్యం బాటిళ్లను భారీ మొత్తంలో తీసుకుంటూ రోజుకు రూ.లక్షలు ఆర్జిస్తు న్నారు. గతేడాది జనవరి 1–11వ తేదీ వరకు జిల్లాలో 37,973 మద్యం బాక్సులు, 13,269 బీరు బాక్సులు డిపోల నుంచి తరలించిన వ్యాపారులు రూ.25.92 కోట్లు చెల్లించారు. తాజాగా ఈ 11 రోజులకు జిల్లాలో ఏకంగా 57,463 బాక్సుల మద్యం (19,490 బాక్సులు అదనం), 15,748 బీరు బాక్సులు (2,479 బాక్సులు అదనం)తీసేసుకున్నారు. అంటే దాదాపు 51 శాతం స్టాకును అదనంగా తీసుకున్నారు. కేవలం ధరల పెరుగుదల కారణంగానే ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటు ధరల పెంపునకు ముందు.. పెంపు తరువాత మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడ్డట్లయ్యింది.
నేటి నుంచి రూ.10 పెంపు
మద్యం బాటిళ్లపై రూ.10 పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సోమవారం రాత్రి జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మద్యం బాటిల్‌పై రూ.10 పెంచుతున్నట్లు పేర్కొంది. బీర్, వైన్‌బాటిళ్లు, రూ.99 మద్యంపై ఈ పెరిగిన ధరలు వర్తించవు.
మద్యం విక్రయాల్లో చిలక్కొట్టుడు!


