తనకు తెలియకుండా భూమిని రాసుకునేశారు
తనకు తెలియకుండా భూమిని రాసుకునేశారని బంగారుపాళ్యం మండలం, కల్లూరుపల్లెకు చెందినమునస్వామి ఆవేదన వ్యక్తం చేశా రు. బాధితుడు మాట్లాడుతూ కల్లూరుపల్లెలో సర్వే నం.176లో కొంత భూమిని తనకు తెలియకుండానే రాసుకుని ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. తాను హేమాద్రినాయుడు అనే అతనికి ఏడు గుంటల భూమిని మాత్రమే అమ్మినట్లు తెలిపారు. కాగా హేమాద్రినాయుడు, చిక్కురుపల్లి సుధా, చిక్కురుపల్లి జ్ఞానశేఖర్, కట్లూరుపల్లి చిన్నరాజా తనను మోసం చేసి మూడు ఎకరాల భూమిని రాసుకున్నారన్నారు.


