నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారన్నారు. అక్కడ కేటగిరి వారీగా సమస్యలను యాప్‌లో నమోదు చేసి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు.
జాయింట్ కలెక్టర్‌గా
ఆదర్శ్ రాజేంద్రన్
– ప్రస్తుత జేసీ విద్యాధరి వైజాగ్‌కు బదిలీ
చిత్తూరు కలెక్టరేట్ : జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను చిత్తూరు జేసీగా నియ మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీగా పనిచేస్తున్న విద్యాధరిని వైజాగ్ జేసీగా బదిలీ చేశారు. జేసీ విద్యాధరి జిల్లాలో ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు.
నూతన జేసీ 2020వ బ్యాచ్
జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన ఆదర్శ్ రాజేంద్రన్ 2020వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఆయన స్వస్థలం కేరళ రాష్ట్రం. 2020లో ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సబ్‌కలెక్టర్, నూజివీడు, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో, జాయింట్ కలెక్టర్, నెల్లూరు, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తూ చిత్తూరుకు బదిలీ పై విచ్చేయనున్నారు. నూతన జాయింట్ కలెక్టర్ సతీమణి అదితిసింగ్ సైతం ఐఏఎస్ అధికారిణిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కి చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసిందని జిల్లా సమగ్రశిక్ష శాఖ జీసీడీవో ఇంద్రాణి వెల్లడించారు. ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడారు. సమగ్రశిక్ష శాఖ ఏపీసీ ఆదేశాల మేరకు పోస్టుల భర్తీ ప్రక్రి య పకడ్బందీగా భర్తీచేస్తామన్నారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడువు తేదీ అనంతరం వచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో కేజీబీవీలోని టైప్ 3 పోస్టులకు 461, మోడల్ స్కూల్స్‌లోని టైప్ 4 పోస్టులకు 251 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అందిన ప్రతి దరఖాస్తును ప్రత్యేక నిపుణుల చేత క్షుణ్ణంగా పరిశీలన చేయిస్తున్నట్లు జీసీడీవో తెలిపారు.
సంక్రాంతికి జాగ్రత్త!
చిత్తూరు కార్పొరేషన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఔత్సాహికులు విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. పండుగ సమయంలో విద్యుత్ పరికరాలు, తీగల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గాలిపటాలు కరెంటు తీగల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్ప ష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లకు దూ రంగా ఎగురవేయాలని, లోహపు దూరాలతో పతంగులు ఎగురవేయరాదన్నారు. పిల్లలు ఇంటిపై కప్పుపై గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ వైర్లు తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నా. ప్రమాదాలు జరిగితే టోల్‌ఫ్రీ 1912 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. అదేవిధంగా ఆ నంబరుతో పాటు ఎల్.ఎమ్.సి 94408 14319 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఏఈలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వివరించారు.


