మార్కింగ్ విస్తీర్ణం తగ్గించాలి
మార్కింగ్ విస్తీర్ణం తగ్గించాలంటూ చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ వద్ద నివసించే లక్ష్మి తదితరులు కోరారు. వారు మాట్లాడుతూ తాము చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డు పక్కన ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి కూలి పనులు చేసి సొంతంగా ఇళ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్గా కూడలి నుంచి ఇరువారం వరకు పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో తాము నివసిస్తున్న ఇళ్లకు మార్కింగ్ చేశారన్నారు. మార్కింగ్ చేసిన ప్రకారం రోడ్ల విస్తరణ చేపడితే తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లులన్నీ దెబ్బతింటాయని చెప్పారు. తిరిగి కట్టుకునే స్థోమత తమకు లేదన్నారు.


