పెరుమాల్ గుంతకు సర్వే చేయాలి
పెరుమాల్ గుంటకు సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయా లని కార్వేటినగరం మండలం, కొల్లాగుంట రెవెన్యూ పరిధిలోని ఈడిగపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన దాశయ్య, దామోదరమ్, కోటేశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ కొల్లాగుంట లెక్కదాఖలలో ఈడిగపల్లి గ్రామం వద్ద ఉన్న సర్వే నం.308/1లో పెరుమాల్‌గుంట పోరంబోకు స్థలం ఉందన్నారు. ఈ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని ఆలయ అవసరాలకు ఇవ్వకుండా గ్రామ ప్రజలతో గొడవలు చేస్తున్నారన్నారు. అధికారులు సంబంధిత స్థలానికి హద్దులు చూపించి గుడి నిమిత్తం వినియోగించుకునేలా ఆదేశాలివ్వాలన్నారు.


