యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జీవీ రమణ
చిత్తూరు కలెక్టరేట్ : యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన జీవీ రమణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఎన్నికను ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో వరుసగా మూడవ సారి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఎన్నికై న జీవీ రమణ మాట్లాడుతూ టీచర్ల సమస్యలను పరిష్కరించడం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు పలువురు యూ టీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏఎంసీ చైర్మన్ ఇంట్లో చోరీ
గంగవరం: పలమనేరు ఏఎంసీ చైర్మన్ రాజన్న నివాసంలో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన సోమవారం మండలంలోని ఆలకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాజన్న పని నిమిత్తం మధ్యాహ్నం ఇంటి నుంచి పలమనేరుకు బయలుదేరి వెళ్లగా ఆయన భార్య లక్ష్మీదేవమ్మ వ్యవసాయ పనులు చూసుకునేందుకు పొలం వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఇనుప రాడ్‌తో డోర్‌ను పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఆపై లాకర్‌లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.2.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం దుండగులు ధ్వంసం చేసి, డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లినట్టు తెలిసింది.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జీవీ రమణ


