లారీ బోల్తా
గుడిపాల : డివైడర్‌ను ఢీ కొనడంతో లారీ బోల్తా పడిందని ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటలకు చిత్తూరు వైపు నుంచి చైన్నె వైపునకు టైల్స్ పౌడర్ మూటలను వేసుకొని సీఎంసీ ఆసుపత్రి వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో వాహనాలు ఏవీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఓవరాల్ చాంపియన్‌గా వెటర్నరీ కళాశాల
చంద్రగిరి : విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ యూనివర్సిటీలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్, లిటరరీ మీట్‌లో తిరుపతి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచారు. సుమారు 530 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. అథ్లెటిక్స్ చాంపియన్లుగా విజయ్, అంజలి నిలిచారు. బాలుర బాస్కెట్ బాల్ పోటీల్లో వర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ వైకుంఠరావు చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పోటీల్లో వేణుతేజ బంగారు పతకాలను సాధించారు. తమ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్లుగా నిలవడం ఆనందంగా ఉందని అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. పీడీ జయచంద్ర, ఓఎస్‌ఏ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్రవంతిని ప్రశంసించారు.
ముక్కంటిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. ఇందులో మైసూరు యదతోర్ మఠం పీఠాధిపతి శంకరభారతిస్వామిజీ, సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి స్వామి, అమ్మవార్లను ఉన్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, మోహన్, ఏపీఆర్వో రవి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
గుడిమల్లంలో ...
ఏర్పేడు: మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వరాలయాన్ని ఆదివారం తెలుగు సినీ నటులు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం చేయించారు. వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టత, ఆలయంపై పురావస్తుశాఖ నిపుణుల పరిశోధనలను గురించి ఆయన వివరించారు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆదివారం న్యూఢిల్లీ సీబీఐ ఐజీ వీరేష్ ప్రభు, విశాఖపట్నం డీఐజీ మురళీరంబ, తిరుపతి అడిషనల్ ఎస్‌పీ వెంకట్రావు దర్శించుకున్నారు. ఆలయాధికారులు వారికి ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి ఘనంగా సత్కరించారు.
లారీ బోల్తా
లారీ బోల్తా
లారీ బోల్తా
లారీ బోల్తా


