ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టరేట్‌లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం ● పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఈఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 21 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆ కేసుల పరిష్కారంలో దాదాపు రూ.1,72,500 చెల్లించడం జరిగిందన్నారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి..
సమావేశంలో డీవీఎంసీ సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పుంగనూరు పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల వసతి గృహంలో 113 మంది బాలికలున్నట్లు తెలిపారు. అయితే నాలు గే మరుగుదొడ్లు ఉండడం వల్ల బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పుంగనూరు మండలం ఎస్టీ కాలనీ వద్ద అనాథ ఆశ్రమానికి 5 ఎకరాల భూమి ని మంజూరు చేయాలన్నారు. ఎస్టీలలో సంప్రదాయ కళాకారులకు పింఛన్‌లు మంజూరు చేయాలని కోరా రు. సదుం మండలంలో యానాదుల అనుభవంలో ఉ న్న భూములను అగ్ర కులస్థులు ఆక్రమించుకుంటు న్నారని చెప్పారు. వారి పై చర్యలు తీసుకోవాలని కో రారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, ఆర్డీవోలు, డీఎస్పీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.


