● జిల్లాలో కరుగుతున్న కొండలు ● అక్రమంగా గ్రానైట్‌ దందా ● కూటమి నేతల కన్నుసన్నల్లోనే అక్రమ క్వారీలు ● మామూళ్ల మత్తులో అధికారులు ● అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదుల పరంపర | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కరుగుతున్న కొండలు ● అక్రమంగా గ్రానైట్‌ దందా ● కూటమి నేతల కన్నుసన్నల్లోనే అక్రమ క్వారీలు ● మామూళ్ల మత్తులో అధికారులు ● అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదుల పరంపర

Apr 11 2025 2:37 AM | Updated on Apr 11 2025 2:37 AM

● జిల్లాలో కరుగుతున్న కొండలు ● అక్రమంగా గ్రానైట్‌ దందా

● జిల్లాలో కరుగుతున్న కొండలు ● అక్రమంగా గ్రానైట్‌ దందా

బంగారుపాళెం మండలం కనతల చెరువు ప్రాంతంలో కూటమి నేతలు అక్రమంగా క్వారీ నడిపిస్తున్నారని ఐదు నెలల కిందట ఫిర్యాదులొచ్చాయి. వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు అలా వెళ్లి ఇలా వచ్చేశారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని వారు పెదవి విరిస్తున్నారు.

చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి ప్రాంతంలో కొండలు బద్దలవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మామిడి తోటల్లో దాగి ఉన్న ఈ క్వారీ నుంచి అక్రమార్కులు ఎవరి కంట పడకుండా విలువైన గ్రానైట్‌ను దర్జాగా దోచేస్తున్నారు. అయినా పట్టించుకునే వారు కరువయ్యారు.

చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లిలో అక్రమంగా సాగుతున్న క్వారీ

పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోనే చిత్తూరు జిల్లాలో ప్రకృతి ప్రసాదిత క్వారీ, గ్రానైట్‌ గనులు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఐదు కిలో మీటర్లు.. మరికొన్ని

చోట్ల ఒకటి, రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు.. పొరుగునే ఉన్న

తమిళనాడుకు చేరుకోవచ్చు. ఇంకేముంది ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా అధిక మొత్తంలో గ్రానైట్‌ తరలించేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, కసితీరా కొండలను కొల్లగొట్టుతున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో అక్రమంగా మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. కూటమి నేతల కన్నుసన్నల్లో విలువైన గ్రానైట్‌, కంకరరాయిని కొల్లగొడుతున్నారు. అవినీతి మత్తులో జోగుతున్న రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెడుతున్నాయి. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. జిల్లాలో 400 వరకు గ్రానైట్‌ క్వారీలున్నాయి. ఇందులో 220 వరకు క్వారీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అనధికారికంగా 70కి పైగా నడుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే 300 వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. చిత్తూరు, బంగారుపాళెం, యాదమరి, ఎస్‌ఆర్‌ పురం, పాలసముద్రం, వి.కోట, రామకుప్పం, కుప్పం, నగరి, గుడిపాల, జీడీనెల్లూరు తదితర మండలాల పరిధిలో గ్రానైట్‌ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం గ్రానైట్‌ క్వారీల నుంచి ఘనపు క్యూబిక్‌ మీటరు ఆధారంగా సీనరేజ్‌ చెల్లించి, బ్లాక్‌లను పాలిషింగ్‌ యూనిట్‌కు తరలించాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో వ్యాపారులు, క్వారీల నిర్వాహకులు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

కంపిస్తున్న గ్రామాలు

క్వారీ పేలుళ్లలో శక్తివంతమైన జెలిటిన్‌ స్టిక్స్‌ వాడి, బండలు పేల్చడంతో ఆ పరిసర ఆ ప్రాంతాల్లోని గ్రామాలు కంపిస్తున్నాయి. ఇళ్లు బీటలు వారుతున్నాయి. బండరాళ్లుపడి వ్యవసాయ పొలాలు దెబ్బతింటున్నాయి. రాళ్లు తగిలి స్థానికులు గాయపడుతున్నారు. వ్యాధికారక రసాయనాలు గాలి, నీరులో కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

కూటమి నేతల గుప్పిట్లో క్వారీలు

అక్రమ క్వారీల నిర్వహణ మొత్తం కూటమి నేతలు గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో మైనింగ్‌ శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. బడా బాబులు, రాజకీయ అండదండలు ఉన్న సంపన్నులు తాము పైకి కనిపించకుండా డమ్మీ వ్యక్తులను ముందు పెట్టి వెనుక నుంచి అక్రమ క్వారీలను నడిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement