
ఈ ఫొటోలోని వృద్ధురాలిపేరు లక్ష్మమ్మ. పెద్దపంజాణి మండలం బొమ్మరాజుపల్లె గ్రామం. సుమారు ఏడేళ్ల క్రితం కింద పడిపోయింది. దీంతో నరాల దెబ్బతిని నడవలేక ఇబ్బంది పడుతూ వచ్చింది. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. ఇటీవల ఆరోగ్య శ్రీ ద్వారా నడుముకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత కూడా ఆస్పత్రికి వెళ్లేందుకు అవస్థలు పడేది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆమెకు అండగా నిలిచింది. డాక్టరే ఇంటికొచ్చి పరీక్షలు చేస్తున్నారు. మందులు, మాత్రలను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లే బాధ తప్పిందని..డాక్టర్లు మంచిగా చూస్తున్నారని వృద్ధురాలు సంతోషంగా చెబుతోంది.