
విద్యార్థులతో అధ్యాపకులు
చిత్తూరు కలెక్టరేట్ : ఐఎన్‌టీఎస్ ఒలింపియాడ్‌లో తమ విద్యార్థులు సత్తా చాటినట్లు శ్రీ చైతన్య ఏజీఎం సురేష్, ప్రిన్సిపల్ చక్రధర్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 3 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించారన్నారు. రెండో లెవల్ పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదో స్థాయి బహుమతులు సాధించారని వివరించారు. మొదటి బహుమతి సాధించిన ఈషాసాయికి ట్యాబ్‌ను బహుమతిగా అందజేశారని వెల్లడించారు