
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ కంపెనీ జొమాటో తన వినియోగదారులకు ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలిసింది. జొమాటో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసే ప్రతి ఆర్డర్‌పై ఇప్పటికే అమలులో ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.5కు పెంచింది. దాంతో తన యూజర్లపై భారం మోపినట్లయింది.
పెంచిన ధరలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జొమాటో తొలిసారి 2023 ఆగస్టులో ప్లాట్‌ఫాం ఫీజును ప్రవేశపెట్టింది. మొదట ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేస్తున్న ఈ ఫీజును అదే ఏడాది అక్టోబర్‌లో రూ.3కు పెంచింది. 2024 జనవరిలో దాన్ని రూ.4కు మరోసారి పెంచారు. తాజాగా అది రూ.5కు చేరింది. ఫుడ్ డెలివరీ సంస్థలు ఆదాయం పెంచుకోవడానికి ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టాయి. జొమాటోకే చెందిన బ్లింకిట్ మాత్రం ఈ ఫీజును రూ.2 చొప్పున వసూలు చేస్తోంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్
ఒక నగరంలో బాగా వినియోగిస్తున్న ఆహార పదార్థాలను ఇతర నగరాల్లోనూ సరఫరా చేసేందుకు ప్రారంభించిన ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవలను కంపెనీ నిలిపేసింది. ఆ సర్వీసుకు వినియోగదారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాన్ని నిలిపేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.