జీ, ఇండస్‌ఇండ్‌ మధ్య సెటిల్‌మెంట్‌

Zee Entertainment resolve dispute over dues with IndusInd Bank - Sakshi

 జీ, ఇండస్‌ఇండ్‌ మధ్య సెటిల్‌మెంట్‌ అన్ని వివాదాలకూ పరిష్కారం  

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) నిలిపివేసింది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్‌మెంట్‌ కుదుర్చుకున్నట్లు జీల్‌ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్‌పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్‌ఇండ్‌.. ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీ.. సంజీవ్‌ కుమార్‌ జలాన్‌ను తాత్కాలిక రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!)

తదుపరి ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ గోయెంకా ఎన్‌సీఎల్‌ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్‌సీఎల్‌ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్‌ గ్రూప్‌ మల్టీసిస్టమ్‌ ఆపరేటర్‌ సిటీ నెట్‌వర్క్స్‌ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్‌ గ్యారంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్‌ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేసిన అవని మల్హోత్రా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top