హయ్యస్ట్‌ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేసిన అవని మల్హోత్రా

IIM Sambalpur Avni Malhotra record of highest salary microsoft - Sakshi

న్యూఢిల్లీ: ఐఐఎం సంబల్‌పూర్ విద్యార్థులు ప్లేస్‌మెంట్లు, వేతనాల విషయంలో సరికొత్త రికార్డ్‌ సాధించారు. గత 7 సంవత్సరాల మాదిరిగానే, ఈ సారి  2021-2023 ఏడాదికి గాను 100శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది. 2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా, వీరిలో 80మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్‌ ప్లేస్‌ కొట్టేసింది. హయ్యస్ట్‌ ప్యాకేజీ అందుకున్న  వరుసలో తమిళనాడు, రాజస్థాన్‌ విద్యార్థులు  నిలిచారు.   (రెడ్‌మి 12సీ, రెడ్‌మి నోట్‌12 వచ్చేశాయ్‌! అందుబాటు ధరలే)

అవని  మల్హోత్రా ఎవరు?
జైపూర్‌కు చెందిన అవనిమల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 64.61 లక్షల వార్షిక జీతాన్ని అందుకోనుంది. పట్టుదల,  కృషి ఉంటే విజయం వచ్చి వరిస్తుందనే మాటకు నిదర్శనంగా తన డ్రీమ్‌ జాబ్‌ను కొట్టేసింది అవని. ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధించి జాక్‌పాట్‌ కొట్టేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతోపాటు  కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్‌  చదవడం ప్రత్యేకంగా నిల బెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను ఛేదించడంలో సాయం చేసిన ప్రొఫెసర్‌లకు, తల్లిదండ్రులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. 

(ఇదీ చదవండిఅచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!)

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్‌మెంట్ సాధించారని ఐఐఎం సంబల్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు. తమ సంస‍్థలో సంవత్సరానికి అత్యధిక జీతం రూ. 64.61 లక్షలుండగా, సగటు జీతం రూ. 16 లక్షలుగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారం, అమూల్, అదానీ, ఈవై, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థల్లో తమ విద్యార్థులు ప్లేస్‌ అవుతున్నారన్నారు. 

(సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top