అన్నీ పరిస్థితులను తట్టుకునేలా.. యమహా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..రేంజ్‌ ఎంతంటే..?

Yamaha e01 Electric Scooter to Be Tested - Sakshi

Yamaha E01 Electric Scooter: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసేందుకు ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం యమహా మోటార్స్‌ సిద్దమవుతోంది. తాజాగా యమహా తన కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ యమహా ఈ01ను పరీక్షించడం మొదలుపెట్టింది. థాయిలాండ్‌, తైవాన్‌, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా ఈ01 లాంచ్‌ చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. 

అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా..!
యమహా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ01ను అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా రూపొందించనుంది. అందుకోసమే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ01ను పరీక్షించనుంది. రానున్న రోజుల్లో యూరప్‌, జపాన్‌లో కూడా ఈ స్కూటర్‌పై పరీక్షలు నిర్వహించనున్నారు. సిటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ డిజైన్ చేసింది యమహా. 

రేంజ్‌ విషయానికి వస్తే..
యమహా ఈ01 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 4.9 kWh లిథియం-అయాన్‌ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ సహాయంతో 5000 ఆర్‌పీఎం వద్ద  వద్ద 8.1 kW మరియు 1,950 rpm వద్ద 30.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటర్‌ సుమారు 100కి.మీ రేంజ్‌ను అందించనుంది. Yamaha E01 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు పవర్ మోడ్‌లతో పాటు రివర్స్ మోడ్‌లో వస్తుంది. స్కూటర్‌లో మూడు ఛార్జింగ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఇటీవలే భారత్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను యమహా ఆవిష్కరించింది. ఐతే ఈ స్కూటర్ల లాంచ్‌ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top