Bamboo Day: వెదురు విస్తీర్ణంలో భారత్‌ రెండో ప్లేస్‌, కానీ.. ఆ చిన్నదేశాల కంటే కిందనే!

World Bamboo Day 2021 Bamboo Business And Significance Of Bamboo - Sakshi

World Bamboo Day 2021: ప్రకృతి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్‌లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. సెప్టెంబర్‌ 18న ప్రపంచ వెదురు దినోత్సవం. 

ప్రపంచ వెదురు(పెంపక-పరిరక్షణ నిర్వాహణ) సంస్థ..  ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 

2009లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ బాంబూ కాంగ్రెస్‌లో  ఈ డేను నిర్వహించాలని తీర్మానించారు.  

వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి.. అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై ఇవాళ ప్రధానంగా చర్చిస్తారు.  

అటవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు.. వెదురు

గిరిజనుల జీవనంలో ఇదొక భాగం

గిరిజనులకు జీవనోపాధిగానే కాకుండా.. వాళ్ల సంప్రదాయాల్లోనూ పవిత్రతను సంతరించుకుంది వెదురు.  

#plantbamboo.. ‘వెదురు నాటండి’ నినాదంతో ఈసారి Bomboo Day 2021ని నిర్వహిస్తున్నారు.

  చైనా, భారత్‌ లాంటి ఆసియా దేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో వెదురు గణనీయమైన పాత్ర పోషిస్తోంది. 

65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. అమెరికా(ద్వయం), ఆఫ్రికా ఖండాలు ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. 

గ్లోబల్‌ బాంబూ మార్కెట్‌ విలువ 2019 నాటికి 72 బిలియన్‌ల డాలర్లుగా ఉంది.  2015 నాటికి అది 98 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. 

చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ మాత్రం 4 శాతంతో సరిపెట్టుకుంది. 

వియత్నం, థాయ్‌లాండ​, కాంబోడియాలు మార్కెట్‌ షేర్‌ మనకంటే ఎక్కువే.
 

మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, స్పెషల్‌ బాంబూ ఎకనమిక్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆర్థిక వృద్ధిని సాధించొచ్చు. 

వెదురు వ్యర్థాలతో అద్భుతం చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, జాతీయ వెదురు మిషన్‌లు ప్రయత్నిస్తే.. మన మార్కెట్‌ సైతం తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి.

   పోవాషియే కుటుంబానికి చెందిన వెదురులో.. 115 జాతులు, 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి. 

 కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఎటు నుంచి నరికినా.. వేగంగా పెరుగుతుంది కూడా. 

ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలపగా చెప్తుంటారు. అంతేకాదు ఆకుపచ్చ బంగారంగా వెదురుకు పేరుంది

ఆహారంతో పాటు కట్టడాలు, నిర్మాణ మెటీరియాల్‌గా, పేపర్‌, హస్తకళల్లోనూ వెదురును ఉపయోగిస్తారు

వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్‌, ఫర్టిలైజర్స్‌ ఏవీ అక్కర్లేదు.   వేస్ట్‌ ల్యాండ్‌లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది

పోషక విలువలు సైతం ఉంటాయి

వెదురు ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి

సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు

వెదురు సామాన్లకు, ఫర్నీచర్‌కు, పరికరాలకు, షోకేజ్‌ వస్తువులకు గ్లోబల్‌ మార్కెట్‌లో ఫుల్‌ గిరాకీ ఉంది
 

- సాక్షి, వెబ్‌డెస్క్‌ స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top