భారత మార్కెట్లలోకి మరో రెండు హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌..! ధర ఎంతంటే..?

Wardwizard Launches High-Speed Electric Scooters Details Here - Sakshi

భారత్‌కు చెందిన వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్‌ మొబిలిటీ సంస్థ రెండు కొత్త  హై-స్పీడ్ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. వోల్ఫ్+, నాను+ అనే రెండు హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసింది. వీటితో పాటుగా డెలివరీ సేవలకోసం ఫ్లీట్ మేనేజ్‌మెంట్ విభాగంలో  డెల్ గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను గుజరాత్‌ వడోదరలోని తయారీ కేంద్రంలో తయారుకానున్నాయి.   

యువతే లక్ష్య ంగా..!
యువతను లక్ష్యంగా చేసుకొని వోల్ప్‌ ప్లస్‌, నాను ప్లస్‌ హైస్పీడ్‌ బైక్స్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. వోల్ఫ్‌+ బైక్‌ పొడిగించిన వీల్‌బేస్‌తో వైడ్ లాంగర్ సీటుతో రానుంది. సిటీ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని సులభమైన సీటింగ్‌తో  నాను+ బైక్‌ను డిజైన్‌ చేశారు. డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్‌తో సౌకర్యంగా అందించనుంది. ఈ బైక్లను  కీలెస్ స్టార్ట్/స్టాప్ ఆప్షన్ కూడా ఉంది.

ఫీచర్స్‌ విషయానికి వస్తే..!
వోల్ఫ్+, నాను+ బైక్‌లో వివిధ సెన్సార్‌ల కలయికతో  అద్భుతమైన ఫీచర్స్‌తో రానుంది. 'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' తో పనిచేయనుంది. బ్లూటూత్‌, ట్రాకింగ్‌, బ్యాటరీ స్టేటస్‌ ఫీచర్స్‌ను వార్డ్‌విజర్డ్‌ ఏర్పాటుచేసింది. ఈ  రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మూడు డ్రైవ్ మోడ్స్‌ వస్తాయి. ఎకో, స్పోర్ట్స్ , హైపర్. రివర్స్‌ మోడ్‌ను మద్దతు ఇస్తాయి. జీపీఎస్‌ సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి ఇతర ఫీచర్సు కూడా ఉన్నాయి. 

రేంజ్‌ విషయానికి వస్తే..!
వోల్ఫ్+, నాను+  ఎలక్ట్రిక్‌ బైక్స్‌లో అద్భుతమైన రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో రానుంది. బ్రేక్ లివర్‌ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని రీఛార్జ్ చేస్తోంది. ఈ బైక్స్‌లో 1500W మోటార్ 20 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.  గరిష్ట వేగం 55 kmph. రెండు స్కూటర్‌లకు బ్యాటరీ 60V 35Ahగా రేట్ చేయబడింది. ఈ బైక్స్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్స్‌పై మూడేళ్ల వారంటీతో రానుంది. వోల్ఫ్‌+ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 1,10,185; కాగా నాను+ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 1,06,991; డెల్‌ గో స్కూటర్‌ ధర రూ.  1,14,500 (ఎక్స్‌షోరూమ్‌)

చదవండి: చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతానంటే ఎలా ? మేము ఒప్పుకోం !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top