ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్‌, ఆఫర్స్‌

Want to Buy a Laptop Check Discount Offers Flipkart End of Season Sale 2022 - Sakshi

సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్  ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌ ప్రకటించింది.  జూన్‌ 11నుంచి మొదలైన ఈ సేల్‌ 17వ తేదీవరకు కొనసాగనుంది.  తాజాగా  ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022  సేల్‌లో  ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్  వినియోగదారుల కోసం డీల్‌లు, డిస్కౌంట్లు,  ఆఫర్‌లను అందిస్తోంది.

ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో  భాగంగా  ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లతో సహా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్స్‌ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్‌, హెచ్‌పీ, షావోమీ, ఎంఎస్‌ఐ  ఏసర్‌ లాంటి  ప్రముఖ బ్రాండ్‌ల ల్యాప్‌టాప్స్‌ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ  ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్  చేసుకునే అవకాశం కూడా ఉంది. 

ఆసుస్‌ వివో బుక్‌ కే15 ఓఎల్‌ఈడీ
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం  రూ.  52,990కే లభ్యం.  ఎంఆర్‌పీ ధర  రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్‌  బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌

లెనోవా థింక్‌బుక్ 13ఎస్‌
ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో   భారీ  తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి.  51 శాతం  డిస్కౌంట్‌తో లెనోవా థింక్‌బుక్ 13ఎస్‌ ను కేవలం  54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.  దీనికి ఎంఆర్‌పీ ధర రూ. 1,12,608. దీనికి  10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్‌ అదనం. 

రెడ్‌మీబుక్ ప్రో
ప్రస్తుతం  ఫ్లిప్‌కార్ట్‌లో 28శాతం డిస్కౌంట్‌తో రూ. 42,990  ధరకే లభిస్తోంది రెడ్‌మీబుక్‌ ప్రో. దీని ఎంఆర్‌పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు.

ఎంఎస్‌ఐ  మోడ్రన్‌ 14
ఈ ల్యాప్‌టాప్‌ను  రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును  18,100 వరకు ఎక్స్చేంజ్  ఆఫర్‌ కూడా లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top