బంపరాఫర్‌, ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌! | Sakshi
Sakshi News home page

బంపరాఫర్‌, ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌!

Published Fri, Dec 22 2023 8:11 PM

Want To Buy Ather,ola,hero Motocorp,You May Have Just Few Days To Get Discount - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనాలనుకుంటున్నారా? అయితే డిసెంబర్‌ 31లోపు కొనేసేయండి. ఈ లోపాటు వెహికల్స్‌ ధరలు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫేమ్‌ పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా ఈవీ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణుల అంచనా. 

డిసెంబర్‌ నెలలలో ప్రముఖ టూవీలర్‌ తయారీ సంస్థలు ఓలా, ఎథేర్‌ మోటార్స్‌, హీరో మోటోకార్పొతో పాటు పలు ఇతర ఆటోమొబైల్‌ సంస్థలు ఈవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. వాటిల్లో ముందుగా ఎథేర్‌ మోటార్స్‌ 450 ఎస్‌ అండ్‌ 450 ఎక్స్‌ మోడళ్లపై రూ.6,500 క్యాష్‌ బెన్ఫిట్స్‌ అందిస్తుంది. అదనంగా రూ.1500 కార్పొరేట్‌ బెన్ఫిట్స్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. ఇక ఎథేర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌ స్కీమ్‌ కింద మరో రూ.5,000 ఆదా చేసుకోవచ్చు. 

ఓలా సైతం ఇయర్‌ ఎండ్‌ ఆఫర్‌ కింద రూ.20వేల వరకు సబ్సిడీ, ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డ్‌లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు డౌన్‌ పేమెంట్‌ తగ్గుతుంది. జీరో ప్రాసెసింగ్‌ ఛార్జీలు వర్తిస్తాయి. 

మరో ఈవీ సంస్థ హీరో మోటోకార్ప్‌ సైతం విడా వి1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.38,500విలువ చేసే ఆఫర్లను అందిస్తుంది. రూ.7,500 వరకు ఈఎంఐ బెన్ఫిట్స్‌, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్‌, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్‌, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్‌, రూ.2,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, రూ.1,125 విలువచేసే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement