గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర

Vaccine Price Cut:Covishield and Covaxin priced At Rs 225 for One Dose In Private Hospitals - Sakshi

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.

కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్‌ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్‌ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్‌ఈ వేరింట్‌ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్‌కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్‌ ఇన్సిస్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ప్రకటించాయి.

సీరమ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ.  225కి మార్చారు.

కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్‌ డోస్‌ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్‌ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top