టారిఫ్‌లపై కంట్రోల్‌ రూమ్‌.. | US announced 26 percent reciprocal tariff on imports from India | Sakshi
Sakshi News home page

టారిఫ్‌లపై కంట్రోల్‌ రూమ్‌..

Apr 3 2025 8:29 AM | Updated on Apr 3 2025 8:57 AM

US announced 26 percent reciprocal tariff on imports from India

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.

ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణ

భారత్‌పై సుంకాల మోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్‌ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement