ట్రీట్‌మెంట్‌ నిలిపివేసిన ఆస్పత్రులు.. అదే జరిగితే ఉద్యోగాలు వదిలేస్తామని లక్షల మంది బెదిరింపు!

Unvaccinated America Employers Ready To Quit Jobs - Sakshi

Unvaccinated Americans: అమెరికాలో వ్యాక్సిన్‌ తీసుకోని వాళ్ల పరిస్థితిపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రపంచంలో జెట్‌ స్పీడ్‌గా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన అమెరికా.. ఆ తర్వాత ఆర్థిక క్షీణత కారణంగా! వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడు వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురావాలన్న ప్రయత్నాలు, తీసుకోని వాళ్లపై వివక్ష చూపిస్తుండడంతో సోషల్‌ మీడియాలో చర్చ రచ్చ నడుస్తోంది.  

వ్యాక్సిన్‌ వేయించుకోని వాళ్ల ప్రయాణాల దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ వివక్ష కనిపిస్తోంది. ఇప్పటికే విమాన ప్రయాణాలపై కీలక సూచనలు వెలువడగా.. క్యాబ్‌ డ్రైవర్లు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రైడ్‌కు సిద్ధపడుతున్నారు. ఇక కొన్ని మాల్స్‌, రెస్టారెంట్లు సైతం వ్యాక్సిన్‌ పూర్తైన వాళ్లను మాత్రమే అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పేషెంట్లకు(కరోనా బారిన పడిన వాళ్లూ ఉన్నారు) చికిత్స ఇవ్వడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో ఓవైపు సింపథీ వ్యక్తం అవుతుండగా.. మరోవైపు డెల్టా వేరియెంట్‌ విజృంభణ తరుణంలో ఇలా చేయడమే సరైన పద్ధతంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఈ రకంగా సోషల్‌ మీడియాలో Unvaccinated Americans చర్చ జోరందుకుంది.
 

పని చేసే చోట
వర్క్‌ ప్లేస్‌లో వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అనే నిబంధన విధిస్తే.. అమెరికాలో లక్షల ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే వ్యాక్సినేషన్‌కు ఉద్యోగులెవరూ సిద్ధంగా లేరు. అసలు ఉద్యోగుల అంతరంగం ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు ఈ మధ్య పోల్స్‌ నిర్వహించాయి. మొత్తం ఉద్యోగుల్లో 16 శాతం మంది వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు సిద్ధంగా ఉండగా, 35 శాతం మంది మినహాయింపులు(మతపరమైన) కోరుతున్నారు. మరో 42 శాతం మంది ఉద్యోగాలు పూర్తిగా వదిలేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మినహాయింపులు లేవని చెబితే ఏం చేస్తారని అడిగితే.. 18 శాతం మంది వ్యాక్సినేషన్‌కు వెళ్తామని చెప్పగా.. 72 శాతం మంది ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగాలు చేయబోమని కుండబద్ధలు కొట్టేశారు.

బైడెన్‌ మొండిపట్టు
అమెరికాలో కొన్ని రాష్రా‍్టల్లో డెల్టా వేరియెంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నవాళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శలు గుప్పించాడు. వీళ్లు ప్రమాదకరమైన వేరియెంట్‌ వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ మండిపడ్డారు. గురువారం వ్యాక్సినేషన్‌ తప్పనిసరి విషయంలో కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికాలో ఇప్పటికి పదిహేడున్నర కోట్ల మంది మాత్రమే వ్యాక్సినేషన్‌ ఫుల్‌ డోసులు పూర్తి చేసుకున్నట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా.. మిలియన్ల మందికి సింగిల్‌ డోస్‌ కూడా పడలేదు. అమెరికాలో కేవలం ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌కు మాత్రమే  ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నుంచి పూర్తి అనుమతి ఉంది.

ఈ తరుణంలో మరిన్ని వ్యాక్సిన్‌లకు అనుమతలు ఇవ్వడం, వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తికి అవసరమైన అనుమతుల్ని త్వరగతిన జారీ చేయడం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అవుతోంది. మరోవైపు ‘వ్యాక్సినేషన్‌ తప్పనిసరి’ నిర్ణయంతో కరోనా నియంత్రణ-అమెరికన్ల భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపెడుతుందన్న ప్రశ్నకు.. అదంతా ‘వ్యాక్సిన్‌ వేసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంద’న్న సమాధానం వైట్‌హౌజ్‌ నుంచి వినిపిస్తోంది.

చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top