రైల్వే ప్రైవేటీకరణ.. అబ్బే అదేం లేదే, పార్లమెంట్‌లో మంత్రి అశ్వినీ వైష్ణవ్ | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రైవేటీకరణ.. అబ్బే అదేం లేదే, పార్లమెంట్‌లో మంత్రి అశ్వినీ వైష్ణవ్

Published Sun, Dec 25 2022 6:44 PM

Union Minister Ashwini Vaishnaw says 80% reserved tickets sold online - Sakshi

భారతీయ రైల్వేలో 80 శాతం రైల్వే టిక్కెట్లు ఆన్ లైన్‌లో అమ్ముడవుతున్నాయని, రైల్వే సేవలు, డేటాబేస్‌ల డిజిటలైజేషన్  ప్రక్రియ  కొనసాగుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రిజర్డ్వ్‌, అన్‌ రిజర్డ్వ్‌ టికెట్ల బుకింగ్‌తో పాటు ఇతర రైల్వే సేవలను అందించడానికి వివిధ  ప్లాట్‌ఫామ్‌లపై మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

భారతీయ రైల్వేలు వినియోగించే టెక్నాలజీతో  ప్రయాణీకులు- సరుకు రవాణా, ప్రాజెక్ట్, ఆపరేషన్స్ -నిర్వహణ, తయారీ, కార్యకలాపాలు - నిర్వహణ, ఫైనాన్స్, మెటీరియల్స్ - మానవ వనరుల వంటి విభాగాల్లో అవసరాలు తీరుస్తాయని అన్నారు. అంతేకాకుండా, భారతీయ రైల్వే కొత్త 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద 1,000 చిన్న ఇంకా ముఖ్యమైన స్టేషన్లను ఆధునీకరించాలని యోచిస్తోంది. ప్రత్యేక పునరాభివృద్ధి కార్యక్రమం కింద 200 పెద్ద స్టేషన్లను పునరుద్ధరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. 

ఆ ఆలోచనే మాకు లేదు
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గతంలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, మరోసారి భారతీయ రైల్వే ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. రైల్వే మంత్రి ప్రకటన అనంతరం రైల్వే ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్టైంది.

Advertisement
Advertisement