కార్మిక శక్తి సర్వే.. దేశంలో నిరుద్యోగం తగ్గిందట!?

Unemployment rate dips to 8. 2percent in Jan-Mar 2022 - Sakshi

దేశంలో తగ్గిన నిరుద్యోగం

జనవరి మార్చి మధ్య 8.3 శాతం

ఎన్‌ఎస్‌వో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం (15 ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉండడం గమనించాలి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

2021 మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్‌డౌన్‌ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్‌–డిసెంబర్‌) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.  

► మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది.  
► పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉండడం గమనించాలి.  
► పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది.  
► పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగులు 7.7 శాతంగా ఉన్నారు. ఏడాది క్రితం ఇది 8.6 శాతంగా ఉంటే, గతేడాది చివరి మూడు నెలల్లో 8.3 శాతంగా ఉంది.  

చదవండి: శాంసంగ్‌ షాకింగ్‌ నిర్ణయం..ఆ సిరీస్‌ ఫోన్‌ తయారీ నిలిపివేత! ఎందుకంటే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top