శాంసంగ్‌ షాకింగ్‌ నిర్ణయం..ఆ సిరీస్‌ ఫోన్‌ తయారీ నిలిపివేత! ఎందుకంటే!

Samsung Likely To Stop Making Galaxy FE Smartphone - Sakshi

శాంసంగ్‌ సంస్థకు చెందిన గెలాక్సీ ఎఫ్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌లు కనుమరుగు కాన్నాయి. ఇప్పటికే గెలాక్సీ ఎస్‌ ఎఫ్‌ఈ (ఫ్యాన్‌ ఎడిషన్‌) పేరుతో పలు ఫోన్‌లను విడుదల చేసింది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ తరహా సిరీస్‌ ఫోన్‌లను శాంసంగ్‌ తయారు చేయబోదని, వాటిని ప్రొడక్షన్‌ను నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్‌22 ఎఫ్‌ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పలు నివేదికల ప్రకారం..శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ ఎస్‌ఎఫ్‌ పేరుతో 12 రకాలైన ఫోన్‌లను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. టోన్‌ డౌన్‌ ఫ్లాగ్‌ షిప్‌ మోడల్‌ ఫోన్‌లపై రూ.60వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తోంది. వాటి స్థానంలో మంచి ఫీచర్లతో బడ్జెట్‌ ఫోన్‌లను కొనుగోలు దారులకు అందించాలని చూస్తుంది. 

చిప్‌ దెబ్బ
శాంసంగ్‌ ఎఫ్‌ఈ మోడళ్లు నిలిపివేడయానికి ప్రధాన కారణం చిప్‌ కొరత, పెరిగిపోతున్న ప్రొడక్షన్‌ ఖర్చేనని తెలుస్తోంది. అందుకే తయారీ తగ్గించి వినియోగదారులకు నచ్చే బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ల  తయారీపై శాంసంగ్‌ దృష్టిపెట్టనుంది.   

బాబోయ్‌ ఖర్చుల భారం
పెరిగిపోతున్న ప్రొడక్షన్‌ ఖర్చుతో పాటు ఇతర కారణాలు శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే శాంసంగ్‌ భారత్‌లో ఫీచర్‌ ఫోన్‌లు అమ్మకాల్ని నిలిపివేసింది. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్‌ఇ సిరీస్‌ను నిలిపి వేయనుందని వార్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో చక్కెర్లు కొడుతుండగా.. ఫోన్‌ నిలిపివేతపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఆగస్ట్‌లో 
మరోవైపు శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ , జెడ్‌ ఫ్లిప్‌ 4 స్మార్ట్‌ ఫోన్‌లను త్వరలో నిర్వహించే ఈవెంట్‌లో పరిచయం చేయనుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న శాంసంగ్‌ ఈవెంట్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చదవండి👉 భారత్‌కు శాంసంగ్‌ భారీ షాక్‌! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top