Toyota Innova EV: వచ్చేస్తోంది...టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

Toyota Reveals Innova EV Concept in Indonesia - Sakshi

ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా మోటార్స్‌ ఈవీ వాహనాలపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా టయోటా ప్రస్తుతం ఇన్నోవా ఈవీ ఎంపీవీ వాహనాన్ని తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోంది. ఈ కొత్త ఇన్నోవా ఎంపీవీ నెక్స్ట్-జెన్ ఇన్నోవా ఎంపీవీగా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

లాంచ్‌ ఎప్పుడంటే..?
ఎంపీవీ సెగ్మెంట్‌లో టయోటా ఇన్నోవా వాహనాలు భారీ ఆదరణను పొందాయి. టయోటా ఇన్నోవా ఈవీ వాహనాన్ని 2023లో  లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందు కొత్త ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ లీక్ అయింది. టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ప్రోటోటైప్ దశలో ఉందని లీకైన చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 

జపనీస్ ఆటోమేకర్ భవిష్యత్తులో ఎంపిక చేసిన మార్కెట్లలోకి ఎలక్ట్రిక్ టయోటా ఈవీ ఎంపీవీ వాహనాన్ని విడుదల చేయవచ్చు. భారత్‌లో ఇన్నోవా క్రిస్టాగా విక్రయిస్తోన్న ఎంపీవీ నెక్స్ట్‌జెన్‌ ఆధారంగా ఎలక్ట్రిక్‌ టయోటా ఇన్నోవా కాన్సెప్ట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రేంజ్, ధర వంటి విషయాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.   

టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, దీనికి ఎలక్ట్రిక్ రూపాన్ని అందించడానికి కొన్ని మార్పులు చేర్చబడ్డాయి. ఇన్నోవా ఎలక్ట్రిక్‌  కాన్సెప్ట్‌లో షట్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, మధ్యలో హెక్సాగోణల్‌  ఫ్రేమ్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కారు కొత్త ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది.

ఇంటీరియర్ కూడా ఇన్నోవా క్రిస్టాతో సారూప్యతను పంచుకుంటుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మొదలైన వాటిని పొందుతుంది. క్యాబిన్ లోపల ఎలక్ట్రిక్ అనుభూతిని అందించడానికి బ్లూ కలర్ కూడా జోడించబడింది.

చదవండి: సరికొత్తగా రెనో కైగర్‌.. అదిరిపోయిన ఫీచర్స్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top