బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు

పీఎన్‌బీలో ఉన్నత ఉద్యోగులకు ఆఫర్
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్‌మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది.
దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్‌కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్‌బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు.