
జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌లపై పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 11గంటల సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టంతో 58297.24 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 118 పాయింట్లు నష్ట పోయి 38604 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది.
ఎస్‌బీఐ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ గ్రూప్,కోల్ ఇండియా, ఎన్టీపీసీ,హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..హీరో మోటా కార్ప్, అథేర్ మోటార్స్,టాటా సీఓఎన్ ఎస్,లార్సెన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి.