తగ్గిన బంగారం ధరలు.. వారం రోజులుగా!

Today Gold Rate In India - Sakshi

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జులై 29, 30 తేదీల్లో పెరిగిన బంగారం.. జులై 31నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల్లో బంగారం ధర మరింత తగ్గడంతో ఔత్సాహికులు బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.ఇండియన్‌ మార్కెట్‌లో శుక్రవారం 22క్యారెట్ల బంగారం ధర పై రూ.200 తగ్గగా, అదే 22 క్యారెట్ల బంగారం శనివారానికి  రూ.750కి తగ్గడంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక శనివారం రోజు మార్కెట్‌ లో బంగారం, వెండిధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

ఈరోజు 22 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.4,570 ఉండగా.. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.4,670 గా ఉంది.
ఈరోజు 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.36,560 ఉండగా.. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.37,360గా ఉంది.
ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. 

ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని  బంగారం ధరలు 

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570గా ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570 గా ఉంది. 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 గా ఉంది. 
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570గా ఉంది. 

ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని  వెండి  ధరలు 

 హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700గా ఉంది
 ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 
 చెన్నైలో  కిలో వెండి ధర    రూ.71,700
 ముంబైలో  కిలో వెండి ధర  రూ.66,600
 కోల్‌కతాలో  కిలో వెండి ధర రూ.66,600 
 బెంగళూరులో  కిలో వెండి ధర  రూ.66,600 
 హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700
 విజయవాడలో కిలో వెండి ధర రూ.71,700  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top