
ఫిబ్రవరి 4 నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం (ఫిబ్రవరి 12) తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల పసిడి ధర గరిష్టంగా 710 రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,670 వద్ద నిలిచాయి. నిన్న రూ. 300, రూ. 320 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఒక్కసారిగా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 710 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 710 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,670 వద్ద ఉంది. నిన్న పసిడి ధరలు ఇక్కడ రూ. 300 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 320 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.
ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
దేశ రాజధాని నగరంలో గోల్డ్ రేటు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,820 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 710 తక్కువ. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. దాదాపు అన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు సమానంగా తగ్గినప్పటికీ.. ఢిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంది.
సిల్వర్ ధరలు
వారం రోజులుగా స్థిరంగా ఉన్న వెండి రేటు.. ఈ రోజు (బుధవారం) కూడా స్థిరంగానే ఉంది. ఢిల్లీలో తప్పా.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కేజీ వెండి రేటు రూ. 1,07,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ. 99,500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).