భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్న టెస్లా కారు!

Tesla Model Y Spotted Testing in Himachal Pradesh Ahead of Launch - Sakshi

త్వరలో భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ టెస్లా కార్లు రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై సందడి చేయనున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్లా-3/టెస్లా-Y మోడల్‌ కార్లను ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ కార్లతో ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తున్న టెస్లా భారత్‌ మార్కెట్‌ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో టెస్లా మోడల్ వై కారును హిమాచల్ ప్రదేశ్ రోడ్లపై టెస్ట్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తూ కనిపించింది. టెస్లా మోడల్ 3 కారు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కారును పరీక్షించింది. ఈ విషయం గురుంచి మొదట టీమ్-బిహెచ్ పీ నివేదించింది. 

విలాసవంతమైన తన కార్లను భారతీయులను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో షోరూంలను, డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతోంది. ఇప్పటికే బెంగళూరు (కర్ణాటక) కేంద్రంగా టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్‌ చేయించింది. దీంతో పాటు ముంబై హెడ్‌ ఆఫీస్‌ గా.. కొన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి ఈ ఏడాది చివరి నాటికి కార్లను విడుదల చేసేందుకు సంస్థ ప్రతినిథులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. టెస్లా మోడల్ వై, మోడల్ 3 ఆధారంగా రూపొందించారు. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 487 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. మోడల్ వై ధర రూ.70 లక్షల నుంచి(ఎక్స్ షోరూమ్) అమ్మకానికి వస్తుందని భావిస్తున్నారు.

(చదవండి: ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా సబ్సిడీలు ఇస్తున్న ఒరిస్సా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top