టెస్లా ఎలక్ట్రిక్‌ ట్రక్‌ వచ్చేసింది..సింగిల్‌ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల ప్రయాణం

Tesla Delivers First Electric Semi Trucks To Pepsi - Sakshi

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ 2017 నవంబర్‌లో టెస్లా సెమీ ట్రక్‌ను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో 2019 లో ట్రక్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన ట్రక్‌ను విడుదల చేశారు. తొలి ఈవీ ట్రక్‌ను ప్రముఖ ఫుడ్‌ బేవరేజెస్‌ కంపెనీ పెప్సికోకి  అందించారు.

మస్క్‌ సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌ల తయారీ ప్రకటనతో పెప్సికో 100 ట్రక్‌లు కొనుగోలు చేసేలా టెస్లాతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ వెహికల్స్‌ను పెప్సికోకు 2021లోనే అందించాల్సి ఉంది. కానీ కోవిడ్‌ కారణంగా తయారీ, విడుదల సాధ్యం కాలేదు. 

ఇప్పుడు ఆ ఈవీ ట్రక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా వీటిలోని ఓకదాన్ని మస్క్‌ స్వయంగా నడిపారు. ఈ సెమీ ట్రక్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మస్క్‌ తెలిపారు. 

ఫీచర్లు, ధర 
37,000 కిలోలు బరువున్న ఈ ట్రక్‌ 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. ఇక ఈ వెహికల్‌ ధర 1,50,000 డాలర్లు ఖరీదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా,ఉత్తర అమెరికాలో 2024లో 50వేల ట్రక్కులను తయారు చేసే లక్ష్యంతో ప్రొడ క్షన్‌ను పెంచాలని  కంపెనీ యోచిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top