టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌; ధర వింటే..!

Tecno Spark Go 2023 launched check specs - Sakshi

సాక్షి,ముంబై: టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  తన స్పార్క్ సిరీస్‌ను రిఫ్రెష్ చేస్తూ టెక్నో స్పార్క్‌ గో 2023ని Tecno  ఆవిష్కరించింది.  త్వరలోనే ఇండియాలోకూడా ఇది లాంచ్‌ కానుంది. ఎంట్రీ-లెవల్ ఫోన్‌ పోకో సీ50, రెడ్‌మిఏ1 లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను ఫోన్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. 

ప్రస్తుతం ఉన్న మోడల్‌ కాస్త అప్‌గ్రేడ్‌చేసి దీన్ని తీసుకొచ్చింది. స్పార్క్ గో 2023 మూడు స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ అయింది.

3జీబీ  ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌  బేస్ మోడల్ ధర రూ.6,999గా  నిర్ణయించింది.  అలాగే 3జీబీ  ర్యామ్‌,  64జీబీ స్టోరేజ్‌, 4జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూనెబ్యులా పర్పుల్‌లో లభ్యం.  

టెక్నో స్పార్క్‌ గో 2023 ఫీచర్లు 
6.56-అంగుళాల IPS LCD
MediaTek Helio A22 SoC
Android 12 HiOS 12.0
రియర్‌ డ్యూయల్ కెమెరా 
f/1.85 ఎపర్చర్‌తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా
QVGA సెన్సార్ , LED ఫ్లాష్‌ 
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top