రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే! | Techie Rejects Rs 47 Lakh Job Offer After Acing Interview | Sakshi
Sakshi News home page

రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!

Mar 21 2026 7:35 PM | Updated on Mar 21 2026 7:37 PM

Techie Rejects Rs 47 Lakh Job Offer After Acing Interview

పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.  ఆ ఆఫర్‌ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement