Tata Consultancy Services (TCS) Said Employees Will Get 100% Variable Pay For June Quarter, No Delay - Sakshi
Sakshi News home page

TCS Variable Pay: టీసీఎస్‌ క్లారిటీ, ఉద్యోగులకు పండగే

Published Thu, Aug 25 2022 10:11 AM

TCS Says No Delay in Employees to Get 100pc Variable Pay June Quarter - Sakshi

సాక్షి,ముంబై: దేశంలోని మేజర్‌ ఐటీ కంపెనీలన్నీ వేరియబుల్ పే విషయంలో ఉద్యోగులకు షాకివ్వగా దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. మొదటి త్రైమాసికంలో  తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తున్నట్లు  స్పష్టం చేసింది.

జూన్‌ క్వార్టర్‌లో సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ పే రోల్ అవుట్‌ను టీసీఎస్‌ ఒక నెల ఆలస్యం చేసిందన్న నివేదికల నేపథ్యంలో టీసీఎస్‌ ఈ క్లారిటీ ఇచ్చింది. పలు నివేదికల్లో తెలిపినట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి-జూన్ త్రైమాసికంలో సీ3ఏ, సీ3బీ, సీ 4, ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపు ఆలస్యం చేయడం లేదని తెలిపింది.

సాధారణ ప్రక్రియ ప్రకారం వేరియబుల్ పే ఒకటి లేదా రెండు నెలల్లో చెల్లిస్తామని, ఈ ప్రక్రియలో ఎలాటి జాప్యం లేదని పేర్కొంది. 100 శాతం చెల్లిస్తామని టీసీఎస్‌ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. కాగా  మార్జిన్‌లపై ఒత్తిడి,  సప్లై చెయిన్‌ సమస్యలు, టెక్నాలజీలో కొత్త పెట్టుబడుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రోతో సహా ఇతర ఐటీ మేజర్లు కూడా తమ ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించడమో, లేదా  ఆలస్యం చేసిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా  విప్రో సి-సూట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు మేనేజర్‌ల వేరియబుల్ పేని కూడా నిలిపివేసినట్టు సమాచారం. ఫ్రెషర్స్ నుండి టీమ్ లీడర్లవరకు గ్రేడ్‌లలోని ఉద్యోగులు మొత్తం వేరియబుల్ పేలో 70 శాతం మాత్రమే పొందనున్నారని తెలుస్తోంది.

Advertisement
Advertisement