
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2020లో మార్కెట్లో విడుదలైన తరువాత.. ఈ హ్యాచ్‌బ్యాక్ (ఆల్ట్రోజ్) మొదటిసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో రానుంది. ఇది మల్టిపుల్ వేరియంట్లలో.. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టనుంది.
2025 టాటా ఆల్ట్రోజ్ లేదా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ ఎస్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ CNG, 1.5-లీటర్ టర్బో డీజిల్ అనే ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది.
ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: వివరాలు
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 90 డిగ్రీస్ ఓపెనింగ్ డోర్స్, 3D ఫ్రంట్ గ్రిల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఈ కారులో ఉంటాయని తెలుస్తోంది. డిజైన్ కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. ఇది ఈ నెల 22న లాంచ్ అవుతుందని సమాచారం.