ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం: ప్లీజ్‌ మోదీజీ! పుతిన్‌ ఆసక్తిర వ్యాఖ్యలు!

Talks On To Open Indian Stores In Russia Vladimir Putin Said - Sakshi

భారత్‌ - రష్యా వ్యాపార ఒప్పొందాలపై వ్లాదమిర్‌ పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారత్‌ రీటైల్‌ స్టోర‍్లను ప్రారంభించేందుకు భారత్‌ (కేంద్రం)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ వేదికగా పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల బిజినెస్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిగ్గా మారాయి. 

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యద‍్దం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన వేలాది దిగ్గజ కంపెనీలు రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. పుతిన్‌ మాత్రం ప్రపంచ దేశాలతో వ్యాపార ఒప్పొందాలు చేసి రష్యాకు పున: వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

రష్యా ఉనికి పెరిగిపోతుంది!
ఈనేపథ్యంలో రష్యా- బ్రిక్స్‌ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోమేతమైనట్లు బ్రిక్స్‌ వేదికగా పుతిన్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రష్యా సమాఖ్య, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 38 శాతం పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. ఉదాహరణకు..రష్యాలో రీటైల్‌ స్టోర్‌లను ఓపెన్‌ చేసేందుకు ప్రధాని మోదీతో ఒప్పిస్తున్నామని, దేశీయ మార్కెట్‌(రష్యా)లో చైనా కార్లు, ఇతర ప్రొడక్ట్‌లు, హార్డ్‌వేర్‌ వాటాల్నిపెంచేలా చర్చిస్తున్నట్లు తెలిపారు. తద్వారా బ్రిక్స్ దేశాలలో రష్యా ఉనికి పెరుగుతుంది' అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌ నిర్ణయం భేష్‌!
రష్యా నుండి ఎక్కువ చమురును దిగుమతి చేసుకోవాలన్న భారత్‌ నిర్ణయంతో అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలతో దాని సంబంధాలు దెబ్బ తిన్నాయని అన్నారు. అయినప్పటికీ భారత్‌ రష్యా నుంచి చేసుకున్న చమురు దిగుమతులలో 2శాతం కంటే ఎక్కువ లేదు. ఆంక్షలు ఉన్నప్పటికీ ఐరోపా స్వయంగా రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారత్‌ సైతం చమరు కొనుగోళ్లను సమర్ధించుకుంటుంది. అంతేకాదు తమ దేశం బ్రిక్స్ దేశాలకు పెద్దమొత్తంలో ఎరువులను ఎగుమతి చేస్తుందని, రష్యా ఐటి కంపెనీలు భారత్‌, దక్షిణాఫ్రికాలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని పుతిన్ చెప్పారు.

చదవండి👉ఉద్యోగుల తొలగింపు..మరింత దూకుడుగా ఎలన్‌ మస్క్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top