రెడ్‌లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on may 15 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: రెడ్‌లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

May 15 2025 9:48 AM | Updated on May 15 2025 9:48 AM

stock market updates on may 15 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు నష్టపోయి 24,511కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 527 ప్లాయింట్లు దిగజారి 80,794 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.82 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.1 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.72 శాతం ఎగబాకింది.

ప్రభుత్వం ఏప్రిల్‌ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమీ పావెల్‌ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్‌ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement