లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on march 05 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Mar 5 2025 9:29 AM | Updated on Mar 6 2025 9:14 AM

stock market updates on march 05 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు ఎగబాకి 22,170కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 296 పాయింట్లు పెరిగి 73,273 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 105.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70.74 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.22 శాతం తగ్గింది. నాస్‌డాక్‌ 0.35 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..

ట్రంప్‌ టారిఫ్‌ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ వీక్లీ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీని గురువారం నుంచి సోమవారానికి మారుస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. అలాగే, నిఫ్టీ నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు కూడా ఎక్స్‌పైరీ నెలలోని ఆఖరు గురువారం కాకుండా ఆఖరు సోమవారం నాడు ఎక్స్‌పైర్‌ అవుతాయి. బ్యాంక్‌ నిఫ్టీ, ఫిన్‌ నిఫ్టీ మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఏప్రిల్‌ 4 నుంచి అమల్లోకి వస్తుంది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్

Advertisement
 
Advertisement
Advertisement