స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు | stock market updates on febraury 11 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు

Feb 11 2025 10:00 AM | Updated on Feb 11 2025 10:56 AM

stock market updates on febraury 11 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 82 పాయింట్లు నష్టపోయి 23,303కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 243 పాయింట్లు దిగజారి 77,065 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 108.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76.13 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.98 శాతం ఎగబాకింది.

అమెరికాకు వచ్చే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌లు విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ సూచీలు నిన్నటి మార్కెట్‌లో భారీగానే పైగా నష్టపోయాయి. అలాగే తమపై పన్నులు విధించే దేశాలపై తిరిగి పన్నులు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి కొత్త కనిష్టానికి చేరుకోవడమూ మరింత ఒత్తిడి పెంచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement