భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Stock Market Close Sensex surges 1695 pts hopes US Iran peace deal 12 June | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Jun 12 2026 3:55 PM | Updated on Jun 12 2026 4:09 PM

Stock Market Close Sensex surges 1695 pts hopes US Iran peace deal 12 June

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్‌ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement