ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం

Stock experts expectations on trading this week - Sakshi

రేపు క్యూ4 జీడీపీ గణాంకాలు విడుదల 

ఎల్లుండి ఆటో అమ్మకాలు, జీఎస్‌టీ వసూళ్లు వెల్లడి 

ఎక్సే్చంజీల్లో మూడు పబ్లిక్‌ ఇష్యూల లిస్టింగ్‌లు

ఈ వారం ట్రేడింగ్‌పై స్టాక్‌ నిపుణుల అంచనాలు 

 ముంబై: స్టాక్‌ మార్కెట్లపై ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ప్రభావం చూపనున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వచ్చే వారం జూన్‌ 6–8 తేదిల్లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలకు(వడ్డీరేట్ల పెంపు) అనుగుణంగా మార్కెట్‌ పొజిషనింగ్‌కు సన్నద్ధం కావొచ్చంటున్నారు. వాతావరణ శాఖ వెల్లడించే వర్షపాత నమోదు వార్తలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించవచ్చు. ఇదే వారంలో ఏథర్, ఈముద్ర, ఈథోస్‌ ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు.  

‘‘అమెరికా మార్కెట్ల రీబౌండ్‌ ర్యాలీ కొంత ఒత్తిడిని తగ్గించింది. అయితే అనిశ్చితులు తగ్గి స్థిరత్వాన్ని ఏర్పరుచుకోవడం కీలకం. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో సాంకేతికంగా నిఫ్టీ 16,350 స్థాయిపై ము గిసింది. బౌన్స్‌బ్యాక్‌ ర్యాలీ కొనసాగితే 16,400 స్థా యిని.., ఆపై 16,700 –16,800 శ్రేణిలో కీలక నిరో ధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700 వద్ద మద్దతు లభిం చొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెచ్‌ యశ్‌ షా తెలిపారు.

సూచీలు గత వారంలో మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాలను ఆర్జించగా, రెండు రెండురోజులు నష్టాలను చవిచూసింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ల్లో సెన్సెక్స్‌ 558 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు చొప్పున పెరిగాయి.
 

మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే..,   
స్థూల ఆర్థిక గణాంకాలు  
జర్మనీ మే ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. రేపు భారత జీడీపీ డేటాతో పాటు ఈయూ మే ద్రవ్యోల్బణ గణాంకాలు (మే 31)న వెల్లడి కానున్నాయి. దేశీయ మే జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాల గణాంకాలూ బుధవారం(జూన్‌ 1న) విడుదల అవుతున్నాయి. అదే రోజున చైనా తయారీ రంగ గణాంకాలు, వెల్లడి అవుతాయి. యూఎస్‌ తయారీ డేటా గురువారం.., యూఎస్‌ ఉద్యోగ గణాంకాల డేటా శుక్రవారం విడుదల అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.

కార్పొరేట్‌ ఫలితాల ప్రభావం
దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్‌ ఈ వారంతో ముగియనుంది. సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. సన్‌ ఫార్మా, ఎల్‌ఐసీ, జుబిలెంట్‌ ఫుడ్స్, డెల్హివరీ, దిక్సాస్‌ టెక్నాలజీ, దీలీప్‌ బిల్డ్‌కాన్, డిష్‌ టీవీ, ధని సర్వీసెస్, ఈక్విటాస్‌ హోల్డింగ్స్, నురేకా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, టీటీకే ప్రస్టేజ్, వికాస్‌ ఎకో టెక్‌ సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ముఖ్యంగా మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ చవిచూడొచ్చు.  

మూడు లిస్టింగులు  
ముందుగా నేడు ఈథోస్‌ ఐపవో షేర్లు లిస్ట్‌ అవుతుంది. గ్రే మార్కెట్లో ఈ షేరు డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అవుతోంది. లిస్టింగ్‌లో మెప్పించకపోవచ్చు. జూన్‌ ఒకటో తేదిన ఈ ముద్ర షేర్లు లిస్టవనున్నాయి. వారాంతపు రోజున స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఎక్చే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు.  

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెల(27 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.44,346 కోట్ల షేర్లను అమ్మేశా రు. బాండ్లపై రాబడులు పెరగడం, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచొచ్చనే భయా లు, దేశీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల తో ఎఫ్‌ఐఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మరి కొంతకాలం ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నా రు. ఎఫ్‌ఐఐలు గడిచిన ఎమినిది నెలల్లో రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులను విక్రయించడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top